'సహకార ఎన్నికల్లో గెలుపే లక్ష్యం'

వరంగల్ జిల్లా:

త్వరలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. మహానేత చేసిన సేవలకు గుర్తింపుగా సహకార ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో చెరుకుపల్లి పాల్గొన్నారు.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించినందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి రైతుల పక్షాన నిలిచి ధర్నాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రజాకంటక పాలనను చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కావడం ఖాయమని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పనిచేసేందుకు ముందుకొస్తున్న నాయకులు, యువకులు, మహిళలు, రైతులకు ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top