నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం

హైదరాబాద్ః రాష్ట్రంలో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై  వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తాన్న చంద్రబాబు...వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. విభజన అనంతరం రాష్ట్రంలో లక్ష 43వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తన స్వ ప్రయోజనాల కోసం ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టడం వల్లే ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయన్నారు.  నిరుద్యోగులు మనోధైర్యం కోల్పోవద్దని, విలువైన జీవితాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.  కలిసికట్టుగా పోరాడి రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించుకుందామని, మంచి రోజు కోసం వేచిచూద్దామని కోరుతూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.  


Back to Top