అధికార పార్టీ అండదండలతోనే హత్యాయత్నం


తప్పించుకోవాలనే ప్రయత్నంతోనే చిన్న ఘటనగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు
రిమాండ్‌ రిపోర్టు చూసి అయినా కళ్లు తెరవండి 
థర్డ్‌ పార్టీతో ఎంక్వైరీ చేస్తే బండారం బయటపడుతుందనే ఢిల్లీకి బాబు
వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఢిల్లీ: అధికార పార్టీ అండదండలతోనే ప్రధాన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని చిన్నదిగా చేసిన అపహాస్యం చేస్తూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి హత్య చేయాలని చూశారన్నారు. ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు వైయస్‌ జగన్‌ కుడివైపుకు తిరగడంతో కత్తి ఎడమ భుజానికి తగలిందని, మెడకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేశారు.  నాయకుడికి ప్రమాదం జరిగి ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారని ఊపిరి పీల్చుకుంటుంటే ముఖ్యమంత్రి మానవత్వం లేకుండా నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన తరువాత నిందితుడు శ్రీనివాసరావును స్టేట్‌ పోలీసులు పట్టుకొని వెళ్లారని, ఈ డ్రామా అంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఎయిర్‌పోర్టులో క్యాంటీన్‌ నిర్వహించేది టీడీపీ నాయకుడు, గాజువాక టికెట్‌ ఆశిస్తున్న హర్షవర్ధన్‌ చౌదరి అని వైవీ చెప్పారు. దాంట్లోనే నిందితుడు పనిచేస్తున్నాడన్నారు. 

కనీసం రిమాండ్‌ రిపోర్టు ద్వారా అయినా చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కత్తి మెడకు తగిలి ఉంటే వైయస్‌ జగన్‌ ప్రాణాలు పోయి ఉండేవని రిపోర్టులో ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్తు తెరవాలన్నారు. కేసును ఏ విధంగా తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎంపీలు వ్యవహరిస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారన్నారు.  వైయస్‌ జగన్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారని తెలిసిందన్నారు. 

వైయస్‌ జగన్‌ జరిగిన హత్యాయత్నంపై థర్డ్‌ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని కేంద్ర హోంమంత్రిని కలవనున్నట్లు వైవీ చెప్పారు. తరువాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కూడా కలుస్తామన్నారు. న్యాయ విచారణ జరిగితే తన లొసుగులన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అనే భయంతో.. చంద్రబాబు ఢిల్లీకి వచ్చి నేషనల్‌ మీడియాను అడ్రస్‌ చేస్తూ ఏమీ లేదని, చిన్న ఘటనే అని చిత్రీకరించే కార్యక్రమం చేశారన్నారు. థర్డ్‌ పార్టీతో దర్యాప్తు చేయిస్తే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయోనని భయంతో చంద్రబాబు వణికిపోతున్నారన్నారు. డీజేపీ వ్యవహారంపై కూడా కేంద్ర హోంమంత్రికి వివరిస్తామన్నారు. 
 
Back to Top