నీరు–చెట్టులో రూ.3.50 కోట్లు దుర్వినియోగం..

నీరు–చెట్టులో రూ.3.50 కోట్లు దుర్వినియోగం..
టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డిన రాజాం వైయస్‌ఆర్‌సీపీ నేతలు..

శ్రీకాకుళంః రాజాం నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులు పేరుతో 3.50కోట్లు టీడీపీ నేతలు దుర్వినియోగం చేశారని రాజాం వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు.ప్రాజెక్టుల ఆధునీకీకరణ పనుల కోసం వినియోగించుకుండా రైతులను ఇక్కట్లు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాన  ఆయకట్ట  మడ్డవలస రిజ్వరాయర్‌ నుంచే వచ్చే ఛానల్‌ ఆధునికీకరణ పనులు చేయకపోవడం నీరు పారడం లేదన్నారు.దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో  సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు జరిగాయన్నారు.టీడీపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు.రేగిడి,వంగర మండలాలకు నారాయణపురం రిజర్వాయర్‌  నుంచి సాగునీరు రావాల్సివుందన్నారు.సాయన్నగడ్డ రిజర్వాయర్‌ను ఆధునికీకరణ చేపట్టకపోవడంతో సాగునీరు రావడంలేదన్నారు. నియోజకవర్గంలో వంతెనలు కూడా గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, నత్తనడకన పనులు సాగుతున్నాయన్నారు.తోటపల్లి ప్రాజెక్టు కుడి,ఎడమ కాల్వల ఆధునీకికరణ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయకపోవడంతో ప్రభుత్వం పసుపు–కుంకుమ డబ్బులను అప్పులుగా బ్యాంకులు జమచేసుకోవడం పట్ల మహిళల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.మహిళలు పెద్ద ఎత్తున్న వైయస్‌ జగన్‌కు వినతి పత్రాలు ఇచ్చారు.
Back to Top