వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై పార్టీ అధికార ప్రతినిధి రోజా మాట్లాడారు. ఈ విషయంలో టీడీపీ నేతలు ఎందుకు కలవరపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ప్రజాసమస్యలపై ప్రధాని మోదీని కలిస్తే దాన్ని వక్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. మీరు కలిసి పోటీ చేసిన బీజేపీపైనే నమ్మకం లేదా, మోదీపై మీకేమైనా అనుమానమా అని సూటిగా ప్రశ్నించారు. దొడ్డిదారిన మంత్రి అయిన యనమల రామకృష్ణుడు.. వైఎస్ జగన్ ను విమర్శించడం వింతగా ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు బండారం బయటపడుతుందని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం రాయలసీమకు కాదు.. చంద్రబాబు, లోకేశ్ లకేనని రోజా అన్నారు.