హోదా..హోరులో ర‌హ‌దారులు

- ఎంపీల దీక్షకు మద్దతుగా జాతీయ రహదారుల దిగ్బంధం
- కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు
- కదం తొక్కుతున్న  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
- అరెస్టుల‌తో అడ్డుకుంటున్న ప్ర‌భుత్వం
 
అమ‌రావ‌తి :  ప్ర‌త్యేక హోదా నినాదాల‌తో జాతీయ ర‌హ‌దారులు హోరెత్తుతున్నాయి. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి నిన‌దిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధనం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కోరుతూ వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చేపట్టిన నిరాహార దీక్షకు మద్ధతుగా ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమాలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్రకార్యాలయం నుంచి సోమవారం ప్రకటన వెలువడిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం నుంచే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.  ఎంపీల దీక్షకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీశ్రేణులు ఏపీలో రిలే నిరాహార దీక్షలకు దిగాయి. పలు నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు తీసి, మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపాయి.అనంతపురం:  తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌  సీపీ నేత పైలానరసింహయ్య చేపట్టిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆరోగ్యం క్షీణించినా ఆయన దీక్ష అలాగే కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ర‌హ‌దారుల‌ను దిగ్బంధించి రాస్తారోకోలు నిర్వ‌హిస్తున్నారు.ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అంకోలా- నెల్లూరు జాతీయ రహదారిని గుంతకల్లులో కార్యకర్తలతో కలిసి వైయ‌స్ఆర్‌  సీపీ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎంపీ ల దీక్షకు మద్దతుగా ధర్మవరం మాజీ శాసన సభ సభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆద్వర్యంలో చేపట్టిన  రిలే నిరహారదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
 ప్రత్యేక హొదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఎంపీల ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా గుత్తిలో బిక్షాటన చేశారు.  హిందూపురం వైయ‌స్ఆర్‌  సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు. 4వ రోజులో భాగంగా తుమకుంట చెక్ పోస్టు వద్ద రహదారుల దిగ్బంధం చేపట్టారు.


నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు  రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో వారికి  మద్దతుగా నెల్లూరు జిల్లా  కొవ్వూరు మండలంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం చేశారు.
సూళ్లూరుపేట హోలీ క్రాస్ సెంటర్లో  వైయ‌స్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధనం. రాస్తారోకో నిర్వహించిన నేతలు కళాత్తూర్ శేఖర్ రెడ్డి..వెంకట రమణా రెడ్డి...రాజా సులోచనమ్మ..తుపాకుల ప్రసాద్.  నిరాహార దీక్షకు మద్దతుగా ఉదయగిరిలో మాజీ ఎంఎల్‌ఏ  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు కొన‌సాగుతున్నాయి.


కృష్ణా జిల్లా : నందిగామలో ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళన చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆందోళనలో భాగంగా మంగళవారం నాడు జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమం ఉండటంతో పోలీసులు ముందస్తుగా ఇంటి వద్దనే హౌస్ అరెస్టు చేశారు. నందిగామ  వైయ‌స్ఆర్‌  సీపీ సమన్వయకర్త మొండితోక జగన్ మోహన్‌తో పాటు మరి కొంత మంది నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  65వ నెంబర్ జాతీయ రహదారి దిగ్బంధం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  ప్రత్యేక హోదా కోసం జగ్గయ్యపేటలో రహదారుల దిగ్బంధం చేసిన పలువురు వైయ‌స్ఆర్‌  సీపీ నేతలను గృహనిర్బంధం చేశారు.  ఇంటి నుంచి బయటకు వచ్చిన వైయ‌స్ఆర్‌  సీపీ  జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ (చిన్న), నంబూరి రవిలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుడివాడలోని గాంధీ మండపంలో ఎమ్మెల్యే కొడాలి నాని  ఆధ్వర్యంలో మైనారిటీ నాయకుల  రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.

వైయ‌స్ఆర్ జిల్లా:  ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద వైయ‌స్ఆర్‌  సీపీ మండల కన్వీనర్ గుంటి మడుగు సుధాకర్ రాజు ఆధ్వర్యంలో కడప- చెన్నై జాతీయరహదారి దిగ్బందం చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆమరణ దీక్షకు మద్దతుగా బద్వేలులో పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్య౦లో చేపట్టిన రిలే రాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. అలాగే పోరుమామిళ్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  వైయ‌స్ఆర్‌  సీపీ  నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూడా నాలుగోరోజుకు చేరుకున్నాయి.  రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి కడప-చెన్నై ప్రధాన రహదారిపై కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.


చిత్తూరు జిల్లా:  ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షలు చేస్తున్న వైయ‌స్ఆర్‌  సీపీ ఎంపీలకు మద్దతుగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద పార్టీ నేతలు చేపట్టిన రిలే దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. సత్యవేడులోవైయ‌స్ఆర్‌  సీపీ నియోజక వర్గ సమన్యకర్త ఆదిమూలమ్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం జరిగింది.

కర్నూలు జిల్లా:  బనగానపల్లె నియోజకవర్గం వైయ‌స్ఆర్‌  సీపీ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్వర్యంలో బనగానపల్లె పట్టణం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 4వ రోజు అవుకు మండలంలో మహిళ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధం రెడ్డి రాం మోహన్ రెడ్డి, పీఆర్ వెంకటేశ్వర రెడ్డి, బండి బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ తదీతరులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో వైయ‌స్ఆర్‌  సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా ఆధోనిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు 167వ నెంబర్‌ జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు పట్టణంలో ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌  సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి దిగ్బందం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐల్యాండ్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అయిదవ రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.  పెనుమంట్ర మండలం  మార్టేరు సెంటర్లో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైయ‌స్ఆర్‌  సీపీ ఎంపీలకు మద్ధతుగా నాలుగో రోజు కొనసాగుతున్నదీక్షలు.  ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష. జాతీయ రహదారుల దిగ్బంధనం.


ప్రకాశం జిల్లా: యర్రగొండపాలెంలో ప్రత్యేక హోదా సాధనకై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు జాతీయ రహదారిపై దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద వైయ‌స్ఆర్‌  సీపీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాల్గోవ రోజు రిలే నిరాహారదీక్షలు. దీక్షలో పాల్గోన్న యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అనంత బాబు, సీతారామాంజనేయులు, దుర్గా ప్రసాద్ రెడ్డి,లింగం రవి,గాగరిన్,అడపా సుబ్బారావు.తాజా వీడియోలు

Back to Top