జననేత సమక్షంలో పార్టీలో చేరిన అనురాధ

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా కదం తొక్కుతున్నారు. రాజమండ్రి 29వ డివిజన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ కురిమిళ్ల అనురాధ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అనురాధ మాట్లాడుతూ.. ప్రజల కోసం వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top