రిజర్వేషన్లపై షర్మిలకు విద్యార్థుల వినతి

గుంటూరు, 05 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల గుంటూరు జిల్లాలో అభిమాన సంద్రం నడుమ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇరుకుపాలెం గ్రామంలో సోమవారం సాగిన ఈ యాత్రలో ఓసీ విద్యార్థులు ఆమెను కలుసుకున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఓసీ విద్యార్థులకు కూడా రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని వారు శ్రీమతి షర్మిలకు విజ్ఞప్తి చేశారు. ఎంత బాగా చదివి మంచి మార్కులు సంపాదించుకున్నప్పటికీ తమకు సీట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తంచేఝశారు. వారి ఆవేదనను శ్రీమతి షర్మిల శ్రద్ధగా విని ముందుకు కదిలారు.  గ్రామంలో నెలకొల్పిన డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఓ చిన్నారికి మురళీధర్ అని పేరు పెట్టి అక్కడినుంచి తరలివెళ్ళారు.

Back to Top