ఇంటి స్థలాలు ఇప్పించాలని వినతి

ఓజిలి: రాచపాళెం గ్రామంలో ఎస్సీలు నివేశన స్థలాలు ఇప్పించాలని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ  సర్పంచ్‌ కొండూరు శ్రీలత ఆధ్వర్యంలో గ్రామస్తులు తహశీల్దార్‌ సత్యవతికి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో 64 మందికి ఇంటి స్థలాలు లేక ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు నివాసం ఉంటున్నామన్నారు. రేల్వేగేటుకు సమీపంలో సర్వేనంబర్‌ 12–1, 2లలో 2.53 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. గత సంవత్సరం నుంచి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్‌లకు విన్నవించిన పట్టించుకున్న దాఖలాలు లేవని విన్నవించారు. ఒకే కుటుంబంలో ఇరుకు ఇరుకుగా నివాసం ఉంటున్నామని పలుసార్లు జన్మభూమి, గ్రామసభలలో అధికారులకు తెలిపిన కాలనీవైపు కన్నేత్తి చూడలేదన్నారు. విఆర్వోతో చర్చించి అర్హలైన వారికి పట్టాలు మంజూరు చేస్తామని హామి ఇచ్చారు. కొండూరు దేవరాజు తదితరులు వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు.

Back to Top