వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం


గన్నవరం: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రామవరప్పాడు గ్రామస్తులు పేర్కొన్నారు. బుధవారం  ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ సమక్షంలో రామవరప్పాడు గ్రామానికి చెందిన టీyî పీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. రామవరప్పాడు గ్రామ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, న్యాయవాది మల్లెపూడి సతీష్‌బాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు 30 మంది వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా సతీష్‌బాబు మాట్లాడుతూ..టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు. వాటికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామంలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ మధ్య కాలంలో దుట్టా రామచంద్రరావు, వెంకట్రావ్‌ తమను కలిసి మద్దతు కోరారన్నారు. రేపు పొద్దున వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. 
 
Back to Top