రమణ దీక్షితులుకు న్యాయం చేస్తాంహైదరాబాద్‌: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు న్యాయం చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ను రమణ దీక్షితులు హైదరాబాద్‌లో కలిశారు. తనకు జరిగిన అన్యాయాన్ని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీలో తనతో పాటు మరో ముగ్గురిని అక్రమంగా తొలగించారని రమణ దీక్షితులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీలో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే తమను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చి న అర్చకత్వం నుంచి తొలగించారని ఆయన చెప్పారు. దీక్షితులు చెప్పిన విషయాలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. వైయస్‌ జగన్‌తో భేటీ అనంతరం రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోసం చాలాసార్లు ప్రయత్నించినా ఆయన నిరాకరించారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ జగన్‌ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నారని పేర్కొన్నారు. 
 
Back to Top