కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పెళ్లకూరు మండలం శిరసనంబేడు వద్ద గురువారం ఉదయం అదుపు తప్పి చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్యేతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ఆర్‌సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బీదా రమేష్‌కు గాయాలు కావడంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కావలి నియోజకవర్గంలో ఈ రోజు పలు వివాహా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన బెంగుళూరు నుంచి రాత్రి కావలికి బయలుదేరారు. శిరసనంబేడు సమీపంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. తనకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.
Back to Top