'రాజన్నరాజ్యం' వచ్చే వరకు ఓపిక పట్టండి!


ఆదోని

15 నవంబర్ : షర్మిల 29వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం కర్నూలుజిల్లా రంగాపురం నుంచి ప్రారంభమైంది. చిన్నకడుబూరు మీదుగా సాగుతూ షర్మిల స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. పత్తి పంట తీరుతెన్నులపై ఆమె ఆరా తీశారు. ఎకరాకు ఎంత పత్తి దిగుబడి ఉంటుందని అడిగారు. కరెంటు ఎలా ఉంటోందని ప్రశ్నించారు. రెండుగంటల కరెంటు కూడా రావడం లేదనీ, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదనీ ఒక రైతు షర్మిలతో వాపోయాడు. ఇంత కష్టపడ్డా గిట్టుబాటుధర ఉండడం లేదన్నాడు. షర్మిల స్పందిస్తూ, 'రాజన్న రాజ్యం' వచ్చే వరకు ఓపిక పట్టాలని రైతులను ఓదార్చారు. స్థానికులతో షర్మిల రచ్చబండ నిర్వహించగా, తమకు రుణాలు అందడం లేదనీ, తాగునీటికి కటకట ఉందనీ వారు చెప్పారు. గురువారం పెద్దకడుబూరులో జరిగే బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారు.

Back to Top