రాజధాని ప్రాంతంలో రాబంధులు..!

రైతులను పీక్కుతింటున్న పచ్చచొక్కాలు..!
బలవంతంగా పేదల అసైన్డ్ భూముల దోపిడీ ..!

గుంటూరుః రాజధాని ప్రాంతంలో రావణరాజ్యం నడుస్తోంది. బరితెగించిన పచ్చప్రభుత్వం బడుగు రైతులపై విషం చిమ్ముతోంది. తరతరాలుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోంటోంది. భూములివ్వని రైతులను బెదిరింపులకు గురిచేస్తూ...పంటలకు కరెంట్ కట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వమే పొలాలు లాక్కొని తన్ని తరిమేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

బడాబాబుల భూదోపిడీ..!
భూమిపత్రాలు చూపినా, శిస్తు కట్టిన రసీదులు చూపించినా పచ్చనేతలు డోంట్ కేర్ కండీషన్ తో చెలరేగిపోతున్నారు. రాజధాని ప్రాంతంలో రాబంధుల్లా వాలిపోయి అన్నదాతను పీక్కు తింటున్నారు. తమ భూములు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా మోటార్లు బిగించి, శిస్తు కట్టుకుంటూ సాగు చేసుకుంటున్న ఖరీదైన భూములను కారు చౌకగా కొట్టేస్తూ పచ్చచొక్కాలు వీరంగం సృష్టిస్తున్నాయి. 

ఖరీదైన భూములను కారుచౌకగా..!
తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి  మండలాల్లోని అనేక గ్రామాలతో పాటు లంక అసైన్డ్ భూములు కలిపి మొత్తం 4 వేల ఎకరాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో నిరుపేదల భూములపై  కన్నేసిన పచ్చచొక్కాలు అందినకాడికి దోచుకుంటూ అరాచక పాలన సాగిస్తున్నారు. 
భూములివ్వని రైతులను బెదిరించి డాక్యుమెంట్లు, రికార్డులు తారుమారు చేసేస్తున్నారు. భూములివ్వకపోతే పరిహారం రాదంటూ  బీదలను బెదిరిస్తూ... అధికారపార్టీకి చెందిన బడాబాబులు కోట్ల రూపాయల విలువచేసే భూములను కొల్లగొట్టేస్తూ తమ పేర రాయించేసుకుంటున్నారు.
 
ప్రభుత్వ దమనకాండపై రైతన్న కన్నెర్ర..!
ఈనెల 26న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి అసైన్డ్ భూముల రైతులకు అండగా నిలిచారు. తెలుగుతమ్ముళ్లు బెదిరించి భూములను లాక్కుంటున్నారని రైతులు తమ గోడును వైఎస్ జగన్ కు చెప్పుకున్నారు. అండగా ఉంటామని వైఎస్ జగన్ వారిలో ధైర్యం నింపారు. లంక భూమిలో తిష్టేసి భూదాహంతో రెచ్చిపోతున్న చంద్రబాబు....అధికార దర్పంతో పేదల పొట్టగొడుతూ  సాగిస్తున్న దమనకాండపై రైతులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యక్షపోరాటానికి సిద్ధమవుతున్నాయి.
Back to Top