టీడీపీది తుక్కు పోరాటం

- వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి
- రెండో రోజుకు చేరిన రాచ‌మ‌ల్లు నిరాహార‌దీక్ష‌
వైయ‌స్ఆర్ జిల్లా:  కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైయ‌స్ఆర్‌సీపీ  పోరాటం ఉధృతం చేసింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మంగళవారం చేప‌ట్టిన 48 గంట‌ల నిరాహార దీక్ష బుధ‌వారం రెండో రోజుకు చేరింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ పేరుతో ఆడుతున్న డ్రామాలపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ రెండు కలిసి ద్రోహం చేశాయని, కడప ఉక్కు రాయలసీమ హాక్కు అని నినదించారు. ప్రత్యేక హోదా హామీలు నెరవేర్చకపోతే పోరాడతాం అనకుండా టీడీపీ నాయకులు లాలూచీ పడ్డారని మండిపడ్డారు. టీడీపీ చేస్తున్న‌ది ఉక్కు పోరాటం కాద‌ని, అది తుక్కు పోరాట‌మ‌ని ఎమ్మెల్యే శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  ఎన్నికల కోసం ఏ అస్త్రం లేక ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా, ఉక్కు అంటూ కపట నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు.  ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని  గల్లీ స్థాయికి తీసుకెళతామని స్పష్టం చేశారు. విభజన హామీల్లో ఇచ్చిన ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.   

Back to Top