రావికంపాడులో నేడు బహిరంగ సభ

ఏలూరు, 15 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాడు 2000 కిలోమీటర్ల మైలు రాయిని అందుకుంటోంది. కిందటేడాది అక్టోబర్ 18న ఆమె వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. బుధవారం సాయంత్రం శ్రీరామవరం చేరుకుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెకు  ఆత్మీయ స్వాగతం పలికారు.

తాజా ఫోటోలు

Back to Top