రాజోలులో వైయస్ఆర్ కాంగ్రెస్ ర్యాలీ

మలికిపురం:

రాజోలు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని కార్యకర్తలు అభిమానులు ర్యాలీలో నినదించారు.  గొల్ల ప్రవీణ్‌బాబు హైదరాబాద్‌లో విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరి నియోజక వర్గానికి వచ్చిన సందర్భంగా ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రవీణ్ ఆధ్వర్యంలో తాటిపాక నుంచి ప్రారంభమైన ర్యాలీని ఏఎంసీ మాజీ చైర్మన్ జక్కంపూడి తాతాజీ జెండా ఊపి ప్రారంభించారు. తాటిపాక నుంచి ర్యాలీ ప్రారంభమై మూడు మండలాల్లోని గ్రామాల్లో సాగింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి, బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానమే శ్రీ జగన్మోహన్ రెడ్డికి కొండంత బలమని ప్రవీణ్ కుమార్ చెప్పారు. పార్టీ నాయకులు బొలిశెట్టి భగవాన్, రాఖీ కుమార్, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వేగిరాజు సాయిరాజు, తెన్నేటి కిషోర్, కుంపట్లు బాబి, కె గాంధీ, కమిడి రాజీవ్ భూషన్ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top