హైదరాబాద్: రైతన్నలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగుల్ని మోసగించిన చంద్రబాబుని ప్రశ్నించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు పార్టీ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు ఈ కరపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో మోసం చేస్తున్న చంద్రబాబు ఆయన మంత్రుల్ని ప్రశ్నిద్దామని పిలుపు ఇచ్చింది. ప్రశ్నిద్దాం.. నిలదీద్దాం..అంటూ సూచించింది. ఇందుకు గాను 20 ప్రశ్నల్ని అందించింది. హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసగిస్తున్న చంద్రబాబుని, ఆయన మంత్రుల్ని ప్రవ్నించి, నిలదీయాలని పిలుపు ఇచ్చింది.