ఆమరణ దీక్షకు ఖతర్‌ సభ్యుల సంఘీభావం

ఖతర్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామ చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ ఖతర్‌ సభ్యులు సంఘీభావం తెలియచేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు శశికిరణ్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్న తెలుగుదేశం పార్టీతోనే ప్రత్యేక హోదా కావాల్సిందే అనిపించిన నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అని తెలిపారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉందంటే అది కేవలం జగన్‌ పోరాటంతోనే అని​ అన్నారు. సుమారు 15 నెలల పదవీకాలాన్ని త్యాగం చేస్తూ ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు ఖతర్‌లోని ప్రవాస ఆంధ్రుల నుంచి హృదయ పూర్వక ధన్యవాదాలు చేస్తున్నట్టు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top