చంద్రబాబు వల్లే ప్రజలు నష్టపోతున్నారు- ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

ఢిల్లీ:

చంద్రబాబు వల్లే రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తికి విలువలు, విశ్వసనీయత లేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అవి పాటిస్తే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని, ప్రత్యేక హోదా, విభజన అంశాలు అన్ని వచ్చేవన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి అన్ని పార్టీల మద్దతు కోరడం జరిగిందన్నారు. చంద్రబాబు ఉదయాన్నే వచ్చి తీర్మానం ప్రవేశపెట్టి మాకు అన్ని పార్టీల మద్దతు ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు వెన్నుపోటుతనం గురించి అన్ని పార్టీల నేతలకు తెలుసన్నారు. ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

Back to Top