నేడు నరసన్నపేటలో వైయస్‌ జగన్‌ బహిరంగ సభ


జననేత ప్రసంగం కోసం ప్రజల్లో ఆసక్తి..
వైయస్‌ఆర్‌సీపీ జెండాలు,ప్లెక్సీలతో పండగ వాతావరణం..

శ్రీకాకుళంః నరసన్నపేటలో  ఆదివారం  జరగబోయే వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జననేత రాక కోసం ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నరసన్నపేట పట్టణమంతా వైయస్‌ఆర్‌సీపీ జెండాలు, ప్లెక్సీలతో నిండిపోయి కోలాహలం నెలకొంది. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ని చూాడాలని , ఆయన ఏ మాట్లాడాతారోనన్న ఆసక్తితో ప్రజలు ఉన్నారు. పలు మండలాల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. ప్రజలకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడతారో,ఏ అంశాలు ప్రస్తావిస్తారో  అని ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అబద్ధాల హామీలతో అధికారంలో వచ్చిన చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో వంశధార ప్రాజెక్టు రెండో ఫేజ్‌ కోసం 900 కోట్ల రూపాయాలు మంజూరు చేశారని, సుమారు 700 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పని కూడా ముందుకు సాగలేదన్నారు .రెండోపంటకు నీరు ఇవ్వలేదన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితేనే మా  కల నెరవేరుతుందని రైతులు అన్నారు. వ్యవసాయధారిత ప్రాంతమైన నరసన్నపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు.

Back to Top