మండ‌ల కేంద్రాల్లో నిర‌స‌న‌లు

చిత్తూరు)) వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి అక్ర‌మ అరెస్టు మీద చిత్తూరు జిల్లా భ‌గ్గుమంటోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న అక్ర‌మాల మీద పోరాడుతున్నందునే టీడీపీ నేత‌ల డైర‌క్ష‌న్ మేర‌కు పోలీసులు వేధిస్తున్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ  దౌర్జ‌న్యాల‌కు వ్య‌తిరేకంగా జిల్లా వ్యాప్తంగా వైయ‌స్సార్సీపీ శ్రేణులు నిర‌స‌న బాట ప‌ట్టాయి. రామచంద్రాపురం, చంద్ర‌గిరి, పాకాల‌, తిరుప‌తి రూర‌ల్ మండ‌ల కేంద్రాల్లో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు నిర‌స‌నలు తెలిపాయి. పలు చోట్ల ర్యాలీలు, ధ‌ర్నాలు నిర్వ‌హించారు. 
Back to Top