నల్ల బ్యాడ్జీలతో నిరసన

ప్రకాశం(పెద్దారవీడు) : ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. పార్టీ మండల నాయకులు పాలిరెడ్డి క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ వైయస్‌ జగన్‌పై పెట్టిన ఆక్రమ కేసును వెంటనే ప్రభుత్వం బేషరతుగా ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహïశీల్ధార్‌ కేవీ సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందించారు. నిరసనలో ఎంపీటీసీ వెన్నా పెద్దపోలిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు దుద్ద్యేల వెంకటరెడ్డి, యూ కాశయ్య, మోటకట్ల అక్కిరెడ్డి, రామక్రిష్ణరెడ్డి, ఎస్సీ నాయకులు కోటేశ్వరరావు, బీసీ నాయకులు తిమ్మిశేట్టి తిమ్మరాజు, సాయిక్రిష్ణ, దుదేకుల కాశయ్య, బత్తుల యల్లయ్య, నాయకులు కాసు వెంకటరెడ్డి, జి వేణుగోపాలరెడ్డి, వజ్రాల అదిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, సాంబయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top