చిత్తూరులోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్రచిత్తూరు : వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. 46వ రోజు అనంతపురం జిల్లా బలిజపల్లి శివారులో యాత్రను ప్రారంభించిన వైయ‌స్‌ జగన్‌ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారి కోట గ్రామంలోకి ప్రవేశించించారు. పాదయాత్రతో చిత్తూరులోకి ప్రవేశిస్తున్న వైయ‌స్‌ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జ‌న‌నేత 260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఎద్దులవారి కోట నుంచి ఎద్దుల వేమన్నగారి పల్లి, ఆర్‌ఎన్‌ తండా, కొట్టాల క్రాస్‌ మీదుగా వసంతపురం మీదుగా గురువారం యాత్ర కొనసాగనుంది. వసంతాపురంలో ప్రజలతో వైయ‌స్‌ జగన్‌ మమేకం కానున్నారు.  

 
Back to Top