ప్రజల మనసుల్లోంచి జగన్‌ను తుడిచేసే కుట్ర

ఉరవకొండ

2 నవంబర్ 2012 : షర్మిల మరో ప్రజాప్రస్థానానికి తండోపతండాలుగా జనం తరలి వస్తున్నారనీ, వైయస్ఆర్ కుటుంబంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే రుజువని వైయస్ఆర్ సీపీ నాయకురాలు, సినీ నటి రోజా అన్నారు. శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గంలో సాగిన షర్మిల 16 వ రోజు పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై కుట్రలు పన్నిప్రజల మనసుల్లోంచి తుడిచేయడానికి జగనన్నని జైలు పాలు చేశాయని దుయ్యబట్టారు. అయితే జగనన్న తరఫున నేనున్నానని షర్మిల పాదయాత్రకు పూనుకున్నారనీ, ప్రజలంతా ఆమె రాకకోసం ఎదురు చూడడం, సంఘీభావం ప్రకటించి తమ సమస్యలు చెప్పుకోవడం చూస్తుంటే రాజన్న కుటుంబంపై ప్రజాభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోందని ఆమె  వ్యాఖ్యానిం చారు. వైయస్ తన సంక్షేమకార్యక్రమాలతో ప్రజల మనసుల్లో దేవుడిగా నిలచిపోయారని రోజా అన్నారు.
వైయస్ఆర్ సీపీ నాయకుడు వై.విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన మారాలన్న ఆకాంక్ష జనంలో కనిపిస్తోందన్నారు. రాజశేఖర్ రెడ్డిగారిని జనం జగన్‌లో చూసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వైయస్ పట్ల చూపిన ఆదరణనే జనం జగన్‌ పట్ల కూడా చూపుతున్నారని ఆయన అన్నారు.

Back to Top