ప్రజల అభీష్టాన్ని దేవుడు నెరవేరుస్తాడు

నారాయణవనం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలన్న ప్రజల అభీష్టాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ మండలంలోని సముదాయం గ్రామంలో వెలసిన అవనాక్షమ్మ ఆలయంలో సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణస్వామి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుతంత్రాలతో జననేతను జైలు పాలుచేశారని ఆరోపించారు. కేసులు నమోదు చేసిన సీబీఐ సైతం విచారణ పేరుతో కాలయూపన చేస్తూ ఆయన విడుదలను అడ్డుకుంటోందన్నారు.  మహానేత వైఎస్‌ఆర్ పాలనలో పేదలకు లబ్ధి చేకూరిందని, వైఎస్‌ఆర్ పథకాలు అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్న పేదల కోరికను వారు మొక్కే దేవతలే నెరవేరుస్తారని అభిప్రాయపడ్డారు. ఆదిమూలం మాట్లాడుతూ నారాయణవనంలో వివాహానంతరం పద్మావతీ అమ్మవారితో కలసి కల్యాణ వెంకటేశ్వరస్వామి అవనాక్షమ్మ ఆలయూన్ని సందర్శించారని తెలిపారు. అవనాక్షమ్మ అమ్మవారు మహిమాన్వితురాలని, వరాలదేవత అని, తల్లి అనుగ్రహంతో జగన్‌మోహన్‌రెడ్డి విడుదల అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

చిత్తూరులో.. 
చిత్తూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పార్టీ నాయకులు సర్వమత ప్రార్థనలు చేశారు. పార్టీ మ హిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవీ ఆధ్వర్యంలో గిరింపేట బ్రాహ్మణవీధిలో ఉన్న యోహావాయీరే క్రైస్తవ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న క్రైస్తవ మహిళలు సైతం ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి పాస్టర్ బ్రదర్ ఏ.పాల్ భూపతిరాజ్ నేతృత్వంలో ఈ ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏయస్.మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక తేనెబండ దర్గాలో పూజలు చేసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి, జిల్లా క మి టీ సభ్యులు సయ్యద్, సుబాన్, ఫి రోజ్, కుట్టి తదితరులు పాల్గొన్నారు. 

తిరుపతిలో..

తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్. జగన్‌మోహన్ రెడ్డి త్వరగా విడుదల కావాలని కోరుతూ నగరంలోని నెహ్రూనగర్ మసీదులో ముస్లిం నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘జగన్‌కి రిహాయి అవామ్‌కి భలాయి. జగన్ ముల్‌జిమ్‌నహీహై జగన్ మజ్‌లూ మ్ హై’ అంటూ జగన్‌మోహన్ రెడ్డి విడుదలకు ప్రార్థనలు చేశారు. ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి కూడా పాల్గొని ప్రత్యేక
ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా  పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖదీర్ మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి జైలు నుంచి త్వరలోనే వెలుపలకు రావాలని అభిలషించారు. ఆయన విడుదల కోసం ముస్లిం సోదరులందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ ప్రార్థనల్లో నెహ్రూ నగర్‌కు చెందిన మైనారిటీ నాయకులు జాన్‌బాషా, అబ్దుల్ కరీ మ్, షాజహాన్, అహంతుల్లా, షంషేర్ బేగం, ఫక్రుద్దీన్, అఫానుల్లా పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
ఉప్పలగుప్తం:  వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కావాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ కేంద్ర క్రమ శిక్షణా సంఘం సభ్యులు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు ఆధ్వర్యంలో గోపవరం శ్రీ ఉమారామలింగేశ్వరుని ఆలయంలో  నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపి జగన్ గోత్రనామాలతో అర్చనలు చేయించారు. బ్రహ్మ శ్రీ పుల్లేటికుర్తి గౌరీశంకర్ బ్రహ్మత్వంలో పలువురు రుత్వికులు పాల్గొన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు కుట్రలు చేసి అక్రమంగా జగన్‌ను జైలుకు పంపారని మహేశ్వరరావు ఆరోపించారు. రాష్ర్ట వ్యాప్తంగా జగన్ విడుదల కోరుతూ పూజలు చేయనివారు లేరని అన్నారు.  పార్టీ రైతు విభాగం నాయకుడు బసవా చినబాబు, మండల కన్వినర్ నిమ్మకాయల హనుమంత శ్రీనివాసరావు, అమలాపురం రూరల్ మండల కన్వీనర్ జంపన రమేష్ రాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కడిమి చిన్నవ రాజు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల పాదయాత్ర
అడ్డతీగల : కుట్రలకు బలై జైలు పాలైన వైయస్ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ మండలంలోని సోమన్నపాలెం, డి.భీమవరం గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల మంది గిరిజనులు  అడ్డతీగల వరకు పాదయాత్ర చేపట్టారు. 8 కిలోమీటర్ల ఈ పాదయాత్రలో ఆ పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ పాల్గొన్నారు. జగన్‌పై ప్రజలకున్న అభిమానానికి ఇటువంటి పాదయాత్రలు నిదర్శనమన్నారు.  ప్రజా సమస్యలు పట్టించుకోక నియంతృత్వ పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌కు చరమగీతం పాడడానికి ప్రతి ఒక్కరూ వైయస్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం అడ్డతీగల దేవి ఆలయంలో పూజలు జరిపారు. అనంత ఉదయభాస్కర్ హోమం నిర్వహించారు. 

కడప పెద్ద దర్గాకు పాదయాత్ర
మైదుకూరు: సీబీఐ అక్రమ కేసుల నుంచి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి విముక్తి కల్పించాలని కోరుతూ ఖమ్మం జిల్లాకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు సయ్యద్ మహబూబ్ కడప పెద్దా దర్గాకు పాదయాత్ర చేపట్టారు. వనిపెంట నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి  ముస్లిం మైనార్టీ నాయకుడు మదీనా దస్తగిరి సాహెబ్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. పాదయాత్రలో పార్టీ నేతలు సంగన కిషోర్‌రెడ్డి, కొప్పర్తి మధుసూదన్‌రెడ్డి, యాకుబ్, అన్వర్‌బాషా, మదీనా అబ్దుల్లా, గౌస్‌లాజం, షబ్బీర్, అచ్చుకట్ల కరీముల్లా, బషీర్, మాలిక్‌బాషా, ఎల్లంపల్లె బాషా, కరీముల్లా, అనీఫ్, అజ్మతుల్లా, సిరాజ్, అన్వర్, ఖాదర్ బాషా, అయూబ్, అల్‌తాఫ్, ప్రకాశం జిల్లా గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం మండలాలకు చెందిన 15మంది యువకులతోపాటు డి.మస్తాన్‌వల్లి, చిన్న మస్తాన్‌వల్లి, కరీముల్లా, మురళి, ఖాసీంవల్లి, వెంకటేశ్వర్లు, శీను, చిన్న, నారయ్య, నాగూరుబాబు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లాలో...
సిరిసిల్ల టౌన్: జనహృదయ నేత వైయస్.జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా జైలుకు పంపాయని వైయస్ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ప్రజాసంక్షేమానికి పాటుపడే వ్యక్తి జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సిరిసిల్ల నుంచి వేములవాడ రాజన్న సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి చేపట్టిన పాదయాత్రలో వందల సంఖ్యలో పాల్గొన్న విద్యార్థుల నుద్దేశించి ఆయన ప్రసంగించారు. వైయస్ జగన్‌ను జైలు నుంచి త్వరగా విడుదలై నిరుపేద ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వైయస్ఆర్‌ సీపీ విద్యార్థులు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజరాజేశ్వరస్వామి సన్నిధికి నడక ప్రారంభించారు. యాత్రను జిల్లా అధికార ప్రతినిధి జక్కుల యాదగిరి, పట్టణ అధ్యక్షుడు గాజుల బాలయ్య, యువజన విభాగం నాయకుడు నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్ ప్రారంభించారు. నాయకులు అక్కరాజు శ్రీనివాస్, విద్యార్థి నాయకుడు సాయి, కరుణాకర్‌రెడ్డి, తిరుపతి, నాని, రశీద్, పవన్, శ్రావణి, పావని, దివ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.

రాజన్నకు మొక్కులు
వేములవాడ: సిరిసిల్ల నుంచి వేములవాడకు పాదయాత్రగా తరలివచ్చిన వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. జక్కుల యాదగిరి, కంచర్ల రవి నాయకత్వంలో సిరిసిల్ల నుంచి బయలుదేరిన పాదయాత్ర వర్షంలో సైతం కొనసాగి వేములవాడకు చేరుకుంది. దారిపొడవునా వైయస్ఆర్ అమర్‌హై... జై..జగన్, జైజై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. వేములవాడ రాజన్న ఆలయం ముందుకు చేరుకున్న వీరికి పార్టీ నాయకులు పొద్దుపొడుపు లింగారెడ్డి, అక్కరాజు శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 5న జగన్‌కు బెయిల్ మంజూరై బయటికి రావాలని మొక్కుకున్నట్లు తెలిపారు. 

మెదక్ జిల్లాలో..
తూప్రాన్: తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా బయటకు రావా లని ఆకాంక్షిస్తూ వైయస్ఆర్ సీపీ నాయకులు పట్టణంలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పార్థనలు చేసి, కొబ్బరి కాయలు కొట్టారు. ఈసందర్భంగా వైయస్ఆర్ సీపీ మండల కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సీబీఐని పావుగా ఉపయోగించుకొని జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించిందన్నారు.  ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశమంతా పాదయాత్రలు చేసినా ఆయనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.

చింతల్ దర్గాలో..
హత్నూర: జగన్మోహన్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని కోరుతూ మండలంలోని రాయిగోడ్ చింతల్ దర్గాలో బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సం దర్భంగా పార్టీ మండల కన్వీనర్ హబీబ్‌బాబా మాట్లాడుతూ జగన్ త్వరగా విడుదల కావాలని కోరుతూ కాసాల, దౌల్తాబాద్ శివారులోని రాయిగోడ్ చింతల్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.  ఎటువంటి అడ్డంకులు లేకుండా జగన్ బయటకు రావాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. 

నెల్లూరులో..
నెల్లూరు: జగన్‌మోహన్‌రెడ్డి 5వ తేదీన బెయిల్‌పై విడుదల కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు ముక్కాల ద్వారకానాథ్ వేదాయపాళెం త్యాగరాజస్వామి మందిరంలో బుధవారం కేరళ నంబూద్రిలతో ప్రత్యేకంగా హోమాలు, పూజలు నిర్వహించారు. శైవం, వైష్ణవం, శాక్తేయం శక్తులు కలిగిన నంబూద్రిలు తొలుత గణపతి హోమం, వీరభద్రహోమం, సుదర్శనహోమం, శక్తిహోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాన్ని పఠించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా వైఎయస్ఆసీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని జగన్‌పై అక్రమ కేసులు బనాయించిందన్నారు. జగన్ విడుదల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ అనేక చోట్ల ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహిస్తున్నారన్నారు. 
ఒంగోలులో..ఒంగోలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంతపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారం జగన్‌ను జైల్లో పెట్టించాయని ఆరోపించారు. ఆయన ప్రజల్లోకి రావాలని ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. 
ఒంగోలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంతపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారం జగన్‌ను జైల్లో పెట్టించాయని ఆరోపించారు. ఆయన ప్రజల్లోకి రావాలని ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. 

Back to Top