ప్రజాప్రస్థానం విజయవంతం కావాలని యాగం

హైదరాబాద్, 13 అక్టోబర్‌ 2012:

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఈ నెల 18 నుంచి ప్రారం‌భించే 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర విజయవంతం కావాలని, ఆమె ఆయురారోగ్యాలతో పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయాలని కోరుతూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు శనివారం హైదరాబా‌ద్‌లో మహాయాగం నిర్వహించారు.

స్థానిక నేత కొలన్ శ్రీనివా‌స్‌రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట అభయాంజనేయస్వామి ఆలయంలో ఈ యాగం నిర్వహించారు. సుమారు 25 మంది వేద పండితులు మన్యుపాశుపత రుద్రయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Back to Top