ప్రజా ప్రస్థానం కోసం వేచిచూస్తున్న ప్రజలు

అనంతపురం:

సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ంలోని ప్రజల బాధలు ఎవరు తీరుస్తారోనని ఎదురు చూస్తున్న తరుణంలో మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తున్నారని వైయస్ఆర్  సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి చెప్పారు. షర్మిల యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడతారన్నారు. చంద్రబాబు యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా రావడం లేదన్నారు. వైయస్ఆర్ పాలనలో సాగునీటి కోసం హంద్రీనీవా పథకం, తాగునీటి కోసం రూ. 1400 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. హిందూపురంలో సెజ్‌లు, చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.వందల కోట్ల బీమా మంజూరు చేసిన ఘనత వైయస్‌దేనన్నారు. ఐదేళ్ల పాలనలో 50ఏళ్ల అభివృద్ధి చేసిన నేతగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయన మరణాంతరం రాష్ట్రాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే వైయస్  లేని లోటు తీరుతుందని భావిస్తుండగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారన్నారు.  ప్రజాభిమానంతో యాత్ర చేపట్టాలి కానీ... పబ్లిసిటీ కోసం చేపట్టకూడదని చంద్రబాబుకు హితవు పలికారు. జగన్‌పై పన్నిన కుట్రలు ప్రజలకు వివరించేందుకు షర్మిల యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారన్నారు.

Back to Top