ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

హైదరాబాద్, 10 జూన్‌ 2013:

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌, పార్టీ శాసనసభా పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్పష్టంచేశా‌రు. సమస్యలను గాలికి వదిలేసిన కిరణ్‌ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌శాసనసభ్యులు సోమవారం ఉదయం ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్రగా వెళ్ళారు.

‌ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. 15 మంది ఎమ్మెల్యేలపై ఇంత ఆలస్యంగా అనర్హత వేటు వేయటం సరికాదన్నారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచారని ఆమె అన్నారు. చంద్రబాబు, కిరణ్కుమా‌ర్‌రెడ్డి పొలిటికల్ ఫిక్సింగ్ ప్రజలందరికి తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు.

‌గతంలో కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ కలిసిన తర్వాతే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారని, నేడు కూడా ఎమ్మెల్యేలపై వేటుపడిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నారని శ్రీమతి విజయమ్మ అన్నారు. బాబు, కిరణ్ ఫిక్సింగ్ రాజకీయాలకు ఇంతకన్నా‌ ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు.

Back to Top