ప్రజా సంకల్పయాత్ర @900కిమీ.


శ్రీకాళ హస్తి నియోజగవర్గం లోని చెర్లోపల్లి వద్ద పండుగ వాతావరణంలో వైయస్ ఆర్ సీపీ అధినేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పయాత్ర లో 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. ఈ సందర్భంగా  ఒక రావి చెట్టును నాటారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. 67 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జననేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ,తమ సమస్యల పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం జగనన్నే అని ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రజా సంకల్పయాత్ర 900కిలోమీటర్లు పూర్తయిన నేపథ్యంలో పాదయాత్రను  ఒకసారి సింహావలోకనం చేస్తే...





ఎక్కడ మొదలైంది...అక్కడే ఎందుకు మొదలైంది...

మాటతప్పని మడమ తిప్పని ఆ మహానేత వైయస్ రక్తం అది. అందుకే ప్రజలపై అంత ప్రేమ. రాష్రంలోని ప్రతి ఒక్కరూ ఆ జననేతకు బంధువులే. అందుకే ఆ బంధం అందించిన జగమంత కుటుంబానికి సేవచేయాలనే తపన. ఒకప్పుడు రాక్షసపాలనకు చరమగీతం పాడేందుకు పాదాలతో పల్లెగీతం పాడారు వైయస్ ఆర్. ఇప్పుడు ఈరోజు మళ్లీ అదే చీకటి పాలన సాగుతోంది. ఆ అవినీతి చీకట్లను ప్రజాశక్తి అనే వెలుగు ఖడ్గంతో చీల్చేందుకు మొదలైందే ప్రజా సంకల్పం. ఎటు చూసినా అవినీతి. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నట్టు నేతలంతా కలిసి రాష్ట్రాన్నిదోచుకుతింటున్నారు. రైతులకు అండ లేదు. కార్మికులకు ఆధారం లేదు. మహిళలకు రక్షణ లేదు. యువతకు ఉపాధి లేదు. చిన్నారులకు భవిష్యత్తే లేదు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, క్షణానికో స్కాము, నిమిషానికో కుంభకోణంతో పీల్చి పిప్పి చేస్తున్న రాజకీయ బకాసురులను గద్దె దించేందుకు ప్రతిపక్ష నేత నడుస్తున్న దారి ప్రజా సంకల్పం. అధికార మదంతో ఓట్లేసిన ప్రజలనే ఛీట్ చేస్తున్న చీప్ రాజనీతికి చెక్ పెట్టే చదరంగమే ప్రజా సంకల్పం. 

ఎదురైన అనుభవాలు - ఉద్వేగాలు

మీ నాయన్ను చూసినట్టుంది. అ మహానేతనే చూసినట్టుంది అంటూ జ్ఞాపకాలను నెమరువేసుకునే వారు కొందరు. మా కోసం ఎన్ని మైళ్లు నడుద్దామనుకుంటున్నావయ్యా...నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ జాగ్రత్తలు చెబుతూ మరికొందరు. నాయకుడంటే నడిపించేవాడు మాత్రమే కాదు, నలుగురి గుండెల్లో నిలిచిపోయిన వాడు...అని నిరూపించిన సందర్భాలెన్నో ఉన్నాయి.. ప్రజా సంకల్ప పాదయాత్రలో. తమ గోడు వినేందుకు రాజన్న బిడ్డ వచ్చాడని సంతోషంతో ఉప్పొంగిన గుండెలెన్నో. ఇంటి పెద్దకొడుకులా కష్టాలను తీరుస్తాడని నమ్ముతున్న కుటుంబాలు ఇంకెన్నో...!!! నాన్న చేసిన మంచిని కొడుకు దగ్గర చెప్పుకునే గొంతులు కొన్ని, చంద్రబాబు పాలనలో గొంతు కోసిన దారణాలు చెప్పుకునే గళాలు ఇంకొన్ని. ఒక పక్క మరణించినా బ్రతికున్న మహానేతకు జేజేలు, మరోపక్క నిలువునా దాష్టీకం చేస్తున్న దుర్మార్గ పాలనకు శాపనార్ధాలు. ప్రతిక్షణం ఓ ఉద్వేగ తరంగం ముంచెత్తుతుంటే ఆ ఆవేశమే ప్రజల ఆశీస్సుగా భావించి ముందుకు సాగుతున్నారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 

అవరోధాలు..

మహోన్నత సంకల్పానికి ఆటంకాలెన్నో ఎదురయ్యాయి. మాటలతో, చర్యలతో, కవ్వింపులతో, కుతంత్రాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజా సంకల్పాన్ని పరిహాసం చేయాలని జరగని ప్రయత్నం అంటూ లేదు. ఇది రాజకీయ యాత్ర అన్నారు. న్యాయస్థానానికి హాజరు కాకుండా ఉండేదుకు అని అవాకులు చెవాకులు పేలారు. ప్రజలు మద్దతివ్వరన్నారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలను పేపర్లలో ప్రచురించి ప్రచారం చేయాలనుకున్నారు. చివరకు పాదయాత్రలో ప్రజలను పాల్గొనకుండా కట్టడి కూడా చేసారు. కానీ అధికారం సృష్టించిన అరాచకపు గోడలను బద్దలు కొట్టుకుని, అవరోధాలను అధగమించుకుని ముందుకు మహోజ్వలంగా సాగిపోతోంది ప్రజా సంకల్ప పాదయాత్ర. ఆ దారికి రహదారులు సలాం అంటున్నాయి. ప్రజల చేతులే తోరణాలై ఆహ్వానం పలుకుతున్నాయి. ముళ్లదారులపై పూల వానలు కురుస్తున్నాయి. ప్రేమతో నిండిన పలకరింపులు బలాన్నీ, ధైర్యాన్ని నింపుతున్నాయి.  

లక్ష్యం...

ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజల నుంచే ధిక్కారం ఎదురవ్వాలి. ఆ ధిక్కార స్వరాన్ని వినిపించడానికి ప్రజలకు ఓ వేదిక కావాలి. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయ గలగాలి. తమ కష్టాలను చెప్పుకుని, కావాల్సినవి అడిగ గలిగే అవకాశం కావాలి. సభల్లో, తెరలపై ప్రదర్శించే అంకెల గారడీ కాదు రాష్ట్ర సంక్షేమం అంటే. విదేశీయుల ముందు ప్రదర్శించిన ఆహాఓహో ఆర్భాటం కాదు రాష్ట్ర ప్రగతి అంటే. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రూపంగా ఉండాలి. వారి అవసరాలు, సౌకర్యాలకు అవాకాశం ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకే వైయస్ ఆర్  కాంగ్రెస్ అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్  ఆరంభించారు ప్రజా సంకల్ప పాదయాత్ర. చంద్రబాబు అవినీతిని కడుగు, నిక్కచ్చిగా నీ హామీలపై అడుగు అంటూ ప్రజల్లో తన అడుగులతో, మాటలతో చైతన్యాన్ని రగులుస్తున్నారు వైయస్ జగన్. ఈ మహాప్రస్థానం 900 కి.మీటర్లు పూర్త చేసుకుని, శ్రీహరికోట రాకెట్ వేగంతో నెల్లూరుకు చేరుకోనుంది. 1000కి.మీటర్లు పూర్తి చేసుకోనుంది ప్రజా సంకల్ప యాత్ర. అడుగడుగునా జన హారతి అందుకుంటూ, అభిమానాన్ని పెంచుకుంటూ, నవరత్నాలను ప్రతిఒక్కరికీ పంచుకుంటూ ప్రజాసంకల్పంలో సాగుతున్న జన నేత, రాష్ట్ర యువహృదయ విజేత వైయస్ జగన్ కు ఇవే శుభాకాంక్షలు. 
Back to Top