ప్రభుత్వం తీరుపై వైయస్‌ఆర్‌సిపి పాదయాత్ర

విజయవాడ, 20 జనవరి 2013: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడలో ఉద్యమ యుద్ధం ప్రారంభించింది. పార్టీ నాయకుడు గౌతంరెడ్డి నేతృత్వంలో ఆదివారం విజయవాడలో పార్టీ నాయకులు, శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని గౌతంరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ‌రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇంటి స్థలం కేటాయించాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ అసమర్థ, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర‌కు వచ్చాయని ఆయన హెచ్చరించారు. ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top