కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్నాం

గుంటూరు: కలుషిత నీరుతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గుంటూరు జిల్లా కొలకలూరు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామస్తులు కలిశారు. కాంటినెంటర్‌ కాఫీ పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషిమవుతున్నాయని చెప్పారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని, కలుషిత నీరు బాటిళ్లను జననేతకు చూపించారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనేక చర్మ వ్యాధులు వస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను తుంగభద్ర కాల్వలో వదులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ స్పందిస్తూ కలుషిత నీరు నియంత్రణకు పోరాటం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొలకలూరుకు శుద్ధ జలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు

తాజా వీడియోలు

Back to Top