తాళి తెంచి.. చీర చించి..!

చంద్రబాబు డైరక్షన్ లో
చిత్తూరు జిల్లా పోలీసులు రెచ్చిపోయారు. వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై
అమానుషంగా దాడి చేశారు. ప్రజాస్వామ్యయుతంగా బంద్ లో పాల్గొన్న మహిళలపై అడ్డగోలుగా
చెలరేగిపోయారు.

వైయస్సార్సీపీ ఇచ్చిన బంద్
పిలుపు మేరకు తిరుపతి లో బంద్ నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన
కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుపతి వీధుల్లో ప్రదర్శన జరిపారు.
దీన్ని అడ్డుకొనేందుకు టీడీపీ నాయకులు పోలీసుల్ని ఉసిగొల్పారు. దీంతో పోలీసులు
రెచ్చిపోయారు. కార్యకర్తల్ని అడ్డగోలుగా లాగిపారేశారు. ఈ క్రమంలో మహిళా
కార్యకర్తలపై దాడికి దిగారు. కొంతమంది తాళిబొట్లను తెంచేశారు. కొందరు చీరల్ని
చించేసి అవమాన పరిచారు. నాయకులు, కార్యకర్తల్ని అవమాన పరచటమే లక్ష్యంగా
రెచ్చిపోయారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మహిళా కార్యకర్తలు తమ ఆవేదనను
వెల్లడించారు. 

Back to Top