పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు

నంద్యాల: టీడీపీ నేతలు పట్టపగలే కత్తులతో దాడులకు పాల్పడుతున్నా నివారించడం లేదని, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని వైయస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు శ్రీదేవి పేర్కొన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ నేత అభిరుచి మధు దాడికి పాల్పడటం దారుణమని ఆమె ఖండించారు.  నంద్యాలలో ఉప ఎన్నిక నేపథ్యంలో మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని విమర్శించారు.  ఓటమి భయంతోనే  ఇలాంటి దాడులకు తెగబడ్డారని ఫైర్‌ అయ్యారు. నంద్యాల ప్రశాంతమైన పట్టణమని, ఇలాంటి ఊర్లో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని తప్పుపట్టారు. నంద్యాలలో  ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీపై దాడులు అధికమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top