ఫీజు పథకంపై వరంగల్‌ విద్యార్థులు ఫైర్

వరంగల్‌, 7 సెప్టెంబర్‌ 2012: కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం పేదలను ఉన్నత చదువులకు దూరం చేస్తోందని వరంగల్ విద్యా‌ర్థులు మండిపడ్డారు. మహోన్నత ఆశయంతో మహానేత ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ప‌థకానికి తూట్లు పొడుస్తోందని వారు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే విద్యార్థుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైయస్ విజయమ్మ‌ గురువారం నుంచి హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద చేస్తున్న నిరాహార దీక్షకు వారు సంఘీభావం ప్రకటించారు.
ఇంజనీరింగ్‌ విద్యార్థుల సంఘీభావం : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ విజయమ్మ దీక్షకు ఏలూరు ఇంజనీరింగ్ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా మహానేత వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చే‌శారు. విజయమ్మ ఫీజు దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైయస్ఆ‌ర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా,  వైయస్ విజయమ్మ ఫీజు‌ దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, మామిడికుదురులో రెండవ రోజూ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
Back to Top