<img style="margin-left:5px;margin-top:5px;float:right" src="http://pdf.ysrcongress.com/filemanager/files/News/ShobhaNagiReddy123.jpg" height="258" width="357">హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012 : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆంక్షలు ఎత్తివేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంక్షలు తొలగిస్తే అన్ని వర్గాల విద్యార్థులకూ ప్రయోజనం చేకూరుతుందని ఆమె అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆమె గురువారం ఇక్కడ అన్నారు. ఫీజుల పథకానికి పరిమితులు విధించినందువల్ల బిసిలకు తీరని అన్యాయం జరుగుతుందని శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు. గతంలో మహానేత వైయస్ కొనసాగించిన విధంగా ఫీజుల పథకాన్ని అమలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.<br>కాగా, మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని పలువురు బిసి నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త మెలికలు పెట్టి ఈ పథకాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైయస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు వారంతా మద్దతు తెలిపారు.