నిరుద్యోగ దీక్షలకు అనుమతుల నిరాకరణ

అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

అనంతపురంః ఏపీ వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నిరసనలు కొనసాగుతున్నాయి. అన్ని కేంద్రాల్లో 48 గంటల దీక్ష  చేపట్టాయి. కొన్ని చోట్ల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ఆంక్షలు పెట్టి నిరుద్యోగుల  సంఖ్యను కుదించారని విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  లక్షా 20వేల పోస్టులకు 18వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం దారుణమన్నారు. అభ్యర్థుల వయోపరిమితి పెంపు గడువు ముగిసిన స్పందించడం లేదన్నారు.  దీక్షలతోనైన మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.  అనంతపురంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరించారు.ఆర్డీవో ఆఫీస్‌ వద్ద దీక్షా శిబిరాలన తొలగించారు. నిరసనగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద విద్యార్థి విభాగం నేతలు ఆందోళనలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులను ఈడ్చిపడేశారు.పలువురిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top