పేరు మార్చారు..నిర్వీర్యం చేశారు..


ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవేదన 
వైయస్‌ఆర్‌ హయాంలో బంగారు తల్లి పథకానికి శ్రీకారం..
చంద్రబాబు హయాంలో మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్పు..
విజయనగరంః వైయస్‌ఆర్‌ హయాంలో బంగారుతల్లి పథకం ఎంతోమందికి లబ్ధిచేకూరిందని, చంద్రబాబు హయాంలో ఆ పథకానికి మార్పులు చేశారని ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ పేదింటి ఆడపిల్లల కోసం బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టి పుట్టిన వెంటనే రూ.30వేల రూపాయాలు అందించే బృహత్తర పథకానికి రూపకల్పన చేశారన్నారు. చంద్రబాబు హయాంలో డబ్బులు ఇవ్వడం పక్కనపెడితే కనీసం ఆఫ్లికేషన్లు కూడా తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకానికి మా ఇంటి మహాలక్ష్మి అని  పేరుమార్చడమే కాకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్న పట్టించుకోలేదన్నారు. ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదన్నారు. ఆఫ్లికేషన్లు తీసుకోవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అంగన్‌వాడీ,వెలుగు విభాగాలు చెప్పుతున్నాయన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో బంగారుతల్లి పథకం కింద ఎంతోమందికి లబ్ధిచేకూరిందన్నారు. వైయస్‌ జగన్‌ వస్తేనే సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయని ఆశతో ఉన్నామని తల్లిదండ్రులు తెలిపారు. 
Back to Top