బాబుకు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెబుతారు

పి.గన్నవరంః చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌లంద‌రూ గ్ర‌హించార‌ని, రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబు విమ‌ర్శించారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పి.గన్నవరం మండలం కె.ముంజవరం గ్రామ పరిధిలోని కఠారులంకలో చిట్టిబాబు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కై వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవితో పాటు 70 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ప్ర‌తీ ఇంటికి తిరుగుతూ ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top