మ‌ద్ద‌తు వెల్లువ‌




- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు
- స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న రైతులు, మ‌హిళ‌లు
- ప్ర‌తిప‌క్ష నేత‌కు అర్జీలు ఇస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ కార్మికులు
- వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న‌
కృష్ణా జిల్లా:  నాలుగేళ్లుగా మోస‌పోతున్న ప్ర‌జ‌ల‌కు నేనున్నాన‌ని ధైర్యం చెప్పేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో కొన‌సాగుతోంది. జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనకదుర్గమ్మ వంతెన మీద అడుగుపెట్టగానే జన సునామీ ఉప్పొంగింది. విజయవాడతో మొదలైన జనజాతర జిల్లాలో పల్లెలు, పట్టణాల గుండా సాగుతోంది. జననేత కోసం జనం పోటెత్తుతున్నారు... ఆయన అడుగులో అడుగు వేస్తున్నారు... ఆత్మీయంగా పలకరిస్తున్నారు...తమ బిడ్డగా భావిస్తూ బాధలు చెప్పుకుంటున్నారు... వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి దారిపొడవునా అందరితో మమేకమవుతున్నారు...బాధలు తీరుస్తానని మాటిస్తున్నారు... అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు...వేసవి తీవ్రతను లెక్కచేయకుండా...అలసటా...విసుగూ లేకుండా జనం మధ్యలోనే సేదదీరుతూ పాదయాత్ర ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అధినేత నిబద్ధతతో కూడిన పోరాటం... నేతలు, కార్యకర్తల కార్యాచరణ వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహాన్నిస్తోంది. వైయ‌స్ జగన్‌ను తమ సొంత బిడ్డ ఇంటికి వచ్చినట్లుగా మహిళలు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా అవ్వాతాతలు వై.ఎస్‌.జగన్‌ను కలుస్తున్నారు. యువత ఉత్సాహానికైతే అవధుల్లేవు.

దారిపొడ‌వునా బాధ‌లు వింటూ..
రైతులు, కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు ...ఇలా అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు.  వైయ‌స్ జగన్‌ను పెద్ద కొడుకుగా భావిస్తూ జనం ఆయనకు తమ బాధలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం పింఛన్లు ఇవ్వడం లేదని...ఇళ్లు ఇవ్వడం లేదని... ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని... కనీస వేతనాలు చెల్లించడం లేదని... కరువు పనులు చేసుకుని కూలీ ఇవ్వలేదని... తమ భూములు ఆక్రమించుకున్నారని... జీఎస్టీతో వ్యాపారులు దెబ్బతింటున్నాయని... మట్టి, ఇసుక దోపిడీనికి పాల్పడుతున్నారని... టీడీపీనేతలు దౌర్జన్యం చేస్తున్నారని... అక్రమ కేసులు బనాయిస్తున్నారని ...ఇలా తమ సమస్యలు ఏకరవు పెడుతున్నారు.  ఎంతో నమ్మకంతో తమ బాధలు చెప్పుకుంటున్న వారి బాధలను వైయ‌స్ .జగన్‌ ఓపిగ్గా వింటున్నారు. సమస్యను బట్టి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారు. రైతులు, కూలీలు, మ‌హిళ‌లు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ కార్మికులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top