చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి

విశాఖపట్నం: అబద్ధాలతో అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. గోలుగొండలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు మోసాలను వివరించారు. ప్రతి ఒక్కరూ వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని ఆదరిస్తే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంంలో మళ్లీ రాజన్న సువర్ణ పరిపాలన తిరిగివస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top