చంద్రబాబు డ్రామాలు ప్రజలు గ్రహించాలి...

కాకినాడః స్వార్థం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు.కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీ అధోగతికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా ఉద్యమించాలని, స్వార్థ ప్రయోజనాలు కోసమే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్నారు. చంద్రబాబుకు బీజేపీతో తెగదెంపులు  చేసుకున్నాక  ప్రత్యేకహోదా గుర్తుకువచ్చిందన్నారు.  మోదీ ప్రశ్నించే దుమ్ము,ధైర్యం బాబుకు లేవని విమర్శించారు. చంద్రబాబు డ్రామాలు ప్రజలు గ్రహించాలన్నారు. వైయస్‌ఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న జగన్‌ నాయకత్వమే రాష్టానికి అవసరమన్నారు. ప్రజలంతా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అండగా ఉండాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top