అడ్డదిడ్డంగా పన్నుల బాదుడుతో ప్రజల ఇక్కట్లు

వైయస్ఆర్ కడప( ఎ్రరగుంట్ల): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అడ్డదిడ్డంగా పన్నుల భారం వేస్తున్నాయని వైయస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి వై. జయరామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన పార్టీ కార్యలయంలో మాట్లాడుతూ.... నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించాలని చెప్పుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వైపింగ్‌ మీషన్‌తో కార్డు ద్వారా లావదేవీలు చేస్తే రెండు శాంత పన్ను వసూళ్లు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పన్నులు వేసేటప్పుడు నగదు రహిత లావదేవీలు అని చెప్పడం ఎందుకు అని విమర్శించారు. ఇప్పటికే నోట్ల రద్దు ప్రభావం నుంచి ప్రజలు కోలుకోలేక పోతున్న తరుణంలో మరల ఇలాంటి పన్నులు వేయడంపై ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటకే పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచి ప్రజా జీవనంపై ప్రభుత్వాలు దెబ్బ వేశాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హయంలో ప్రజలు పన్నుల బాధలు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు కూడా విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top