వ్యవస్థలను మేనేజ్ చేయడంతో చంద్రబాబు దిట్టవైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి
విజయనగరంః పన్ను చెల్లించని వారిపై ఐటిదాడులు సర్వ సాధారణమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.కొంతమందిపై జరిగిన దాడులను రాష్ట్రంపై జరిగిన దాడిగా చిత్రీకరించేందుకు బాబు యత్నిస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, .రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను అధికార పార్టీకి అనుకూలంగా మలిచారని ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని, టీడీపీ దమననీతి, రుణమాఫీ చేస్తానని మోసపూరిత వాగ్దానాల పట్ల మహిళలలో తీవ్ర వ్యతిరేకిత వచ్చిందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.