వైయస్‌ఆర్‌సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్‌ అరెస్ట్‌..
పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.
తాడిప్రతి వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి
అనంతపురంః తాడిప్రతి వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.కూచివారిపల్లిలో అక్రమ మైనింగ్‌ పరిశీలించేందుకు వెళ్లరాదని ఆంక్షలు విధించారు. జేసీ సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్దారెడ్డి విమర్శించారు. అక్రమ మైనింగ్‌ చేస్తూ రూ.కోట్లు దోచుకుంటున్నా మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు.పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Back to Top