పెద్దకూడాలకు చేరిన షర్మిల యాత్ర


పులివెందుల:

మహానేత తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం సాయంత్రం 5 గంటలకు పులివెందుల నియోజకవర్గంలోని పెదకూడాల క్రాస్ రోడ్డుకు చేరుకుంది. ప్రజలు సమస్యలు విన్నవించుకున్నారు. మంచినీరు దొరకడం లేదనీ, బురదనీరు తాగాల్సి వస్తోందనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు సాగు నీరు అందడంలేదనీ, విద్యుత్తు సరఫరా సక్రమంగా లేదనీ రైతులు మొరపెట్టుకున్నారు.  చీనీ రైతులు తమ ఇక్కట్లను వివరించారు. ఎండిపోయిన చీనీ చెట్లను రైతులు ఆమెకు చూపించారు. గతంలో వైయస్ విజయమ్మ చీనీ రైతుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడారనీ, ప్రయోజనం లేకపోయిందని షర్మిల వారికి చెప్పారు. తాను కూడా ఈ అంశంపై ఆందోళన చేపడతానని ఆమె తెలిపారు. ప్రతి ఇంటినుంచి ప్రజలు వచ్చి పాదయాత్రతో కలిశారు. వైయస్ఆర్ తర్వాత తమ గోడు పట్టించుకునే వారు లేకపోయారని చెప్పారు. వారి సమస్యలను సావధానంగా విన్న షర్మిల భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఇక్కడినుంచి లింగాల చేరుతుంది. అక్కడ బహిరంగ సభ అనంతరం యాత్ర ముగుస్తుంది.

Back to Top