పేదల ఆర్తనాదాలు చెవికి ఎక్కడం లేదా..!

పట్టెడు అన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్యం..!
ప్రజల ఆకలి తీరాలంటే బాబు పోవాల్సిందే..!

విజయవాడః ధరల పెరుగుదలను నిరసిస్తూ విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. అన్ని రకాల నిత్యవసర వస్తువులతో పెద్ద ఎత్తున రోడ్డు మీదకివచ్చి ఆందోళన చేపట్టారు. కూరగాయలు, పప్పు, ఉల్లి సహా నిత్యవసర వస్తువులన్నంటినీ ప్రదర్శిస్తూ ప్రభుత్వతీరుపై నినాదాలు చేశారు. చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు గడ్డే మిగిలిందని సింబాలిక్ గా చూపించారు. ప్రభుత్వం నిర్వాకం వల్ల పేదలు కనీసం పూట కూడ తినే పరిస్థితి లేదన్నారు.

చంద్రబాబు  ఆకాశహర్మాలు  కడతానంటూ ఆకాశంలో విహరిస్తూ...పేదవాడి ఆకలిని గుర్తించే పరిస్థితిలో లేడని వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి ఫైరయ్యారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టలేని స్థితిలో చంద్రబాబు దుర్మార్గమైన పాలన సాగుతుందని దుయ్యబట్టారు. మండుతున్న ధరలతో  ఏం కొనాలన్నా, తినాలన్నా ప్రజలు  అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. 

పేదల ఆర్తనాదాలు చెవులకు సోకట్లేదా చంద్రబాబు, చెవుల్లో సీసీం పోసుకున్నావా అని గౌతంరెడ్డి మండిపడ్డారు.  ధరలు పెంచనని చెప్పి ..వచ్చిన దగ్గర్నుంచి ఛార్జీలు బాదుతూ , భూదోపిడీకి పాల్పడుతూ, ధరల భారం మోపుతూ ఇలా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ప్రజల ఆకలి తీరాలన్నా, నిరుద్యోగులకు జాబు రావాలన్నా బాబు పోవాల్సిందేనన్నారు. 

రాబోయే రోజుల్లో పేద, మధ్య తరగతి ప్రజానీకం ప్రభుత్వాన్ని పడగొట్టడం తథ్యమన్నారు. బాబు వచ్చే నాటికి ఇప్పుడు చూసుకుంటే ధరలు రెండింతల పైన పెరిగిపోయాయని గౌతంరెడ్డి అన్నారు. ఉల్లి కన్నీరుపెట్టిస్తోంది. బియ్యం ఆకాశాన్నంటింది. కందిపప్పు కానరాకుండా పోయిందని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా కూడా ఉంగరంలో కందిపప్పు చూపిస్తోందంటే..చంద్రబాబు పాలన ఆకాశంలో విహరిస్తోందని  అర్థమవుతోందన్నారు.
Back to Top