() బట్ట బయలు అయిన పచ్చ పార్టీ రాక్షసత్వం() రోజా ను మరోసారి నిలిపివేసిన అసెంబ్లీ వర్గాలు() నడిరోడ్డు మీద మండుటెండల్లో రోజాకు అవమానం() శాంతియుతంగా ఆందోళన హైదరాబాద్) అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ మరోసారి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. హైకోర్టు ఆదేశాలతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా ఎమ్మెల్యే రోజాను అధికార బలంతో, అహంకారంతో తెలుగుదేశం ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రజాస్వామ్య యుతంగా వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయానికి ఎమ్మెల్యే రోజా సభా ప్రాంగణానికి చేరుకొన్నారు. అయితే అక్కడ అప్పటికే పెద్ద ఎత్తున మార్షల్స్ మోహరించారు. రోజాను లోపలకు అనుమతించేది లేదంటూ అడ్డుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ దురహంకారాన్ని మరోసారి ప్రదర్శించారు. శాసనసభ ను గుప్పిట్లో పెట్టుకొని సాగిస్తున్న దురహంకార వైఖరిని బయట పెట్టుకొన్నారు. దీంతో అక్కడే నిలిచిపోయి రోజా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర రోడ్డు ఫుట్ పాత్ మీద కూర్చొని నిరసన తెలిపారు. మండుటెండల్లో నిలిపివేయటంతో అక్కడే నిలిచిపోయి నిరసన వ్యక్తం చేశారు. ఆమెకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావంగా నిలిచారు.