మరుగుదొడ్డి బిల్లులను చెల్లించండి

గాలివీడు : మండలంలో కొర్లకుంట, తలముడిపి గ్రామాలలో మరుగుదొడ్డి బిల్లులను వెంటనే చెల్లించాలని వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు భానుమూర్తిరెడ్డి అధికారులను డిమాండ్‌ చేశారు.  కొర్లకుంటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీల గౌరవాన్ని కాపాడాలని కోరారు. మరుగుదొడ్డి బిల్లుల కోసం లభ్దిదారులు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోతున్నారన్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మరుగుదొడ్డి బిల్లులు లబ్ధిదారులకు అందేవిధంగా చూడాలన్నారు. 

Back to Top