పవన్‌కల్యాణ్‌..ఓట్ల రాజకీయాలు మానుకో....


ఆరోపణలతో కాదు..ప్రజాభిమానంతో పోటీ పడాలి..
 జగన్‌ను ఫాక్షనిస్టుగా చిత్రీకరించడం దారుణం..
పవన్‌కల్యాణ్‌పై  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజం

ఏలూరుః ఓట్లు సంపాదించడానికి  వైయస్‌ జగన్‌పై బురదచల్లే ప్రయత్నం పవన్‌కల్యాణ్‌  చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. జగన్‌మోహన్‌ రెడ్డిని  లక్ష్యంగా చేసుకుని పవన్‌  ప్రసంగించడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసిందన్నారు. పవన్‌కల్యాణ్‌ మానసిక స్థితి ఏవిధంగా ఉంది. అధికార పక్షం అవినీతి, అన్యాయాలపై ప్రశ్నించకుండా విపక్షంపై ఆరోపణలను ఖండించారు.  వైయస్‌ జగన్‌ను ఫ్యాక్షనిస్టుతో పోల్చడాన్ని తప్పుబట్టారు.. వైయస్‌ జగన్‌ ఎక్కడైన దౌర్జన్యాలు చేసిన దాఖలాలు వున్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డిపై ఎక్కడైనా కనీసం ఒక పోలీసు కేసు కూడా నమోదు అవ్వలేదన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో వైయస్‌ జగన్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులో ఉండి తమ వ్యాపారాలు చేసుకున్నారే తప్ప తమ తండ్రి పాలనలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు.  వైయస్‌ జగన్‌ను ఫ్యాక్షనిస్టుగా చిత్రికరించి ఓట్లు సంపాదించాలనే భ్రమతో ఉన్నారని విమర్శించారు..
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తండ్రి రాజారెడ్డి టీడీపీ మద్దతుదారుల చేతుల్లో  దారుణహత్యకు గురైతే..హత్య జరిగిన కొద్దికాలానికే రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ప్రతికార చర్యలకు పాల్పడలేదన్నారు. తండ్రి మరణం వైయస్‌ఆర్‌ను తీవ్రంగా కలచివేసినా చట్ట ప్రకారమే ఆయన ముందుకెళ్ళారు తప్ప అధికారాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. అలాంటి రాజన్నబిడ్డ వైయస్‌ జగన్‌పై ఫాక్షనిస్టు అంటూ వ్యాఖ్యానాలు చేయడం పద్దతి కాదన్నారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ప్రజాభిమానం సంపాదించడంలో వైయస్‌ జగన్‌తో పవన్‌కల్యాణ్‌ పోటి పడాలని సూచించారు.  వైయస్‌ జగన్‌పై బురదచల్లడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందవచ్చనుకోవడం  ఆయన భ్రమ మాత్రమేనన్నారు. ఫ్యాక్షనిజం అనేది మీ మాటల్లో ఉందని, బహిరంగసభలో ఆవేశంగా మాట్లాడతారన్నారు. వైయస్‌ జగన్‌ లక్షల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారని దానికి ఆధారాలు ఉన్నాయా అంటూ  ప్రశ్నించారు. కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్ని వైయస్‌ జగన్‌ను కేసుల్లో ఇరికించాయన్నారు. కాంగ్రెస్‌  అధిష్ఠానం మాట జగన్‌ వినలేదనే అక్కసుతో వైయస్‌ జగన్‌ను జైలు పాలు చేశారన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసుఅన్నారు . నిరాధారణమైన ఆరోపణలు మానుకోవాలన్నారు. ప్రత్యేకహోదా సభలో నేనొక్కడినే ప్రత్యేకహోదాపై పోరాడినని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేకహోదాపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు  ఢిల్లీ పారమెంట్లులో ఆమరణ నిరాహార దీక్షలు చేసి పదవులకు రాజీనామా చేస్తే కనీసం పరామర్శించడానికి కూడా పవన్‌కల్యాణ్‌ రాలేదన్నారు.  ప్రజల కోసం పోరాటాలు చేసే చిత్తశుద్ధి గల నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. 
Back to Top